కరీంనగర్: మా నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుంది, ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం: మాజీ ఎమ్మెల్యే రవిశంకర్
కరీంనగర్ లో ఎలకల మందు తాగి హిమ్మత్ నగర్ కు బండారి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసినదే.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీనివాస్ ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సోమవారం పరామర్శించారు. బస్సు సౌకర్యం కల్పించాలని అడిగినందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరో వ్యక్తిని పురమాయించి కేసు పెట్టించి పోలీసులతో కొట్టించడం తో మనస్థాపంతో ఎలకల మందు తాగి నట్టు శ్రీనివాస్ తెలిపాడని అన్నారు. రక్షించ వలసిన వారే భక్షిస్తున్నారని, శ్రీనివాస్ కు జరిగిన అన్యాయంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.