ఇటీవల పార్లమెంట్లో వాల్మీకి బోయల ఎస్టీ అంశం ప్రస్తావిస్తూ, వారి వెనుకబాటుతనం వివరిస్తూ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఆంధ్రప్రదేశ్ మహర్షి వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీని కలుస్తామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.