మంత్రి నారాయణ ఆడియో లీక్ పై స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు అజిజ్.
మంత్రి నారాయణ సిటీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్ ఆడియో లీకైన ఘటనపై టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ స్పందించారు. సందర్భానుసారంగా మంత్రి నారాయణ మాట్లాడిన వ్యాఖ్యలు సరైనవేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరూ గొడవలు పెట్టుకోవద్దని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని మంత్రి నారాయణ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని అజీజ్ శనివారం సమర్ధించారు.