పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు పటిష్ట భద్రత, డాగ్ & బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, కీలక సూచనలు చేసిన DSP
పలమనేరు: పట్టణం నందు డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మీడియా తెలిపిన సమాచారం మేరకు. 9వ తేదీ ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. ముసలి మడుగు వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద డాగ్ మరియు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రజలకి అనుమతి లేదు ఎలిఫెంట్ హబ్ వద్ద ఏనుగులు ఉంటాయి టపాకాయలు పేల్చడం ఇలాంటివి చేస్తే ఏనుగులు బెదిరి ఇబ్బందికర పరిస్తితి నెలకొనవచ్చు కాబట్టి ప్రజలు సహకరించాలన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే పర్యటనకు అనుమతి ఉంటుంది కాబట్టి మిగతావారు సహకరించాలన్నారు.