ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో ఉలవపాడు, దర్శి ప్రాంతాలలో పర్యటిస్తున్న కలెక్టర్ రాజాబాబు, పల్లెనిద్ర కార్యక్రమంలో పోతవరంలో బస
Ongole Urban, Prakasam | Apr 10, 2026
ప్రకాశం జిల్లాలో శుక్రవారం కలెక్టర్ రాజాబాబు వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉలవపాడు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. భూసేకరణ వంటి అంశాలపై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం రాత్రి బస చేసి పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారని కార్యాలయం నిర్వహణ అధికారులు తెలిపారు.