నంద్యాల జిల్లా డోన్ మండలం చింతలపేటలో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజW పనులకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.