రాజమండ్రి సిటీ: రైళ్లపై రాళ్లు విసిరే ఆకతాయిల కోసం రాజమండ్రిలోని పలు ప్రాంతాలలో రైల్వే పోలీసులు తనిఖీ
రాజమండ్రిలోనే రైలు పట్టాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. చర్చి పేట, లక్ష్మీవారపుపేట ప్రాంతాలలో రైళ్లపై కొందరు ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాల్లోని రైలు పట్టాలను ఆర్పిఎఫ్ పోలీసులు పరిశీలించారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పోలీసులు తెలిపారు.