ఆర్డిటి క్రీడా మైదానంలో ఏడవ రాష్ట్రస్థాయి రెవిన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలోమంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఉప్పరపల్లి వద్ద ఆదివారం మూడు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు నిర్వహించిన ఏడవ రాష్ట్ర రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో మంత్రి సత్య ప్రసాద్ పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులు కలిసి మూడు రోజులు పాటు రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం శుభ పరిణామం అని రెవెన్యూ ఉద్యోగులు గెలుపు ఓట్లను సమానంగా తీసుకుని వృత్తిపరంగా మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.