ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత
నంద్యాల పార్లమెంటు జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ సమన్వయ కమిటీ సభ్యులకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన నలుగురు సభ్యులకు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియామక పత్రాలు అందజేశారు, అనంతరం పార్టీ నిర్మాణం పై దిశా నిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు సమర్చిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు