తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు బుగ్గ రామలింగేశ్వరస్వామి, శ్రీ పార్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఛైర్మన్, కమిటీ సభ్యులు వేదమంత్రోచ్ఛారణల నడుమ వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.