రాప్తాడు: చిన్మయ నగర్ వద్ద టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన అనంతపురం కమిషనర్ బాలస్వామి,అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ చిన్మయ నగర్ వద్ద శుక్రవారం 11:45 నిమిషాల సమయంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కమిషనర్ బాలస్వామి టిడ్కో ఇల్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ 2019లో ఇళ్ల నిర్మాణం చేపట్టగా వైయస్సార్ పార్టీ వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోవడం జరిగిందని తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు జరుగుతున్నాయని 2026 మార్చి కి ఇల్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలస్వామి హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.