రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీశైలం లో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు.క్షేత్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.ప్రత్యేకంగా సామాన్య భక్తుల సౌకర్యాల పట్ల మరింత శ్రద్ధ కనబరచాలని సూచించారు. ప్రతి ఉద్యోగి కూడా భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.అలాగే శివసేవకుల స్వచ్ఛంద సేవలను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు.