నంద్యాల అర్బన్: భూమిపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నాం: నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Jun 11, 2026
రైతులకు భూమిపై పూర్తి హక్కులను కల్పించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల 32వ వార్డు పరిధిలోని ఉడుమాల్ పురంలో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను డిప్యూటీ కలెక్టర్ సూరజ్ ధనుంజయతో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ పట్టాదార్ పాస్ పుస్తకాల వల్ల రైతులు సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు