ఖాజీపేట: కాజీపేటలో ఆర్ఓబి పనులు వేగంగా సాగుతున్నాయి.ఎమ్మెల్యే వార్త చెప్పలేదు
కాజీపేటలో ఆర్ఓబి పనులు వేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాజీపేట ఆర్ఓబి కింద ఇప్పటికే మొదటి వంతెన పనులు పూర్తికాగా, రెండో వంతెన నిర్మాణం కొంతమేర పురోగమించిందని తెలిపారు. రైల్వే అధికార్ల సూచనల మేరకు ఇనుప వంతెన నిర్మాణం చేపట్టామని తెలిపారు.ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ట్రాఫిక్‌ను తగ్గించేందుకు రెండో వంతెన పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు