అనంతపురం అర్బన్: వరి మడుగు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం వరిమడుగు గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బండమీద పల్లి గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.