గుంతకల్లు: పామిడిలోని సరస్వతి విద్యా మందిరంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ సప్త శక్తి సంగమం
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో ఆర్ఎస్ ఎస్ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా సప్తశక్తి సంగం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిరం నిట్టూరునిలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కుటుంబ ప్రభోదనకు సంబందించిన అంశాలను పాఠశాల ప్రధానాచార్యులు తులసి బాయి వివరించారు. ఈ సందర్భంగా హెచ్ ఎం మహిళలకు సందేశాన్ని ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో మహిళ, గృహిణి పాత్ర ఏమిటి అనే విషయాలను పాఠశాల కమిటీ సభ్యురాలు చంద్రిక వివరించారు. ఈ కార్యక్రమానిక