మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో మద్యం సీసాలలోడుతో వెళుతున్న డీసీఎం బోల్తా పడిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మద్యం మద్యం డిపో నుంచి లోడును తీసుకెళ్లే క్రమంతో డీసీఎం వాహనం ఒకసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డీసీఎం లోని మద్యం బాటిళ్లు బీరు సీసాలు, ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.