డోన్: రెండేళ్లలో డోన్ నియోజకవర్గం రూ. 6.02 కోట్ల CMRF చెక్కుల పంపిణీ: డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 15, 2026 నంద్యాల జిల్లా డోన్ టీడీపీ క్యాంపు కార్యాలయంలో CMRF ద్వారా మంజూరైన రూ.27.05 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన 653 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6.02 కోట్ల ఆర్థిక సహాయం అందినట్లు వెల్లడించారు. ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాల బాధితులు, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు