గూడూరులో రైలు పట్టాలు దాటుతున్న నర్రావుల బాబు బాలాయపల్లి మండలం, వాక్యం గ్రామం అనే వ్యక్తిని గురువారం రైలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఉదయం ఊరు నుంచి గూడూరుకు వచ్చిన బాబు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.