డోన్: డోన్ లో గాలి వాన బీభత్సం,విద్యుత్ సరఫరాలో అంతరాయం
Dhone, Nandyal | Jun 14, 2026 డోన్లో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు తారకరామానగర్ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పట్టణమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. త్వరితగతిన సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.