బనగానపల్లె: బనగానపల్లెలో టిడిపి నేతను. పరామర్శించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన ముస్లిం సామాజికవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.