ఎమ్మెల్సీ భరత్ కు టిటిడి బోర్డు మెంబర్ శాంతారాం శుక్రవారం సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటు కర్ణకు వ్యతిరేకంగా కుప్పంలో 63,000 మంది సంతకాలు పెట్టారని ఎమ్మెల్సీ భరత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కుప్పంలో 63 మంది సంతకాలు పెట్టినట్లు రుజువు చేస్తే టిటిడి బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా భరత్ అని ప్రశ్నించారు.