బనగానపల్లె: బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ
బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. వారి జీవనోపాధి, వృత్తుల గురించి ఆరా తీసిన సీఐ, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరారు. ఒకవేళ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.