పలమనేరు: పెద్దపంజాణి:తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కు తరలించిన పోలీసులు పోలీసులు
పెద్దపంజాణి :మండలం రాయలపేట గ్రామంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు, తండ్రి మందలించాడని దివ్య అనే 17 ఏళ్ల బాలిక సూసైడ్ అటెంప్ చేసింది. కుటుంబీకులు పోలీసు మరియు ఆసుపత్రి వర్గాలకు సమాచారం తెలపగా ఘటన ప్రాంతానికి చేరుకొని బాలికను 108 ద్వారా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని తెలిపారు. కాగా ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.