బనగానపల్లె: త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి : కొలిమిగుండ్ల తాసిల్దార్ విశ్వతేజ ఎంపీడీవో దస్తగిరి బాబు
వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామపంచాయతీ సిబ్బంది తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొలిమిగుండ్ల తహశీల్దార్ సాయి విశ్వతేజ, ఎంపీడీవో దస్తగిరి బాబు పేర్కొన్నారు. శుక్రవారం కొలిమిగుండ్ల మండలం మీర్జాపురంలో ఒక ఊరు.. ఒక నెల.. నాలుగు పర్యటనలు.. కార్యక్రమంలో భాగంగా అధికారులు పర్యటించారు. రెవెన్యూ సమస్యల ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు.