బోథ్: సుంకిడి గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు,అడ్డుకున్న పోలీసులు
బోథ్ ఎక్స్ రోడ్డు సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ, ని బీఆర్ఎస్ నాయకులు చింపి వేశారని ఆరోపిస్తూ శనివారం తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిష్టి బొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించారు. కాగా దాన్ని ఆపేందుకు వచ్చిన పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.