పెదకూరపాడు: సీఎం జగన్ పై హత్యాయత్నం పిరికిపందల చర్య - ఎమ్మెల్యే శంకరరావు.
విజయవాడలో సీఎం శ్రీ వైఎస్ జగన్ పై హత్యాయత్నం పిరికిపందల చర్య అని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. ఆయన ఆదివారం ఉదయం 11గంటలకు మీడియాతో మాట్లాడుతూ...కేవలం సీఎం జగన్ కు ప్రజల్లో ఉన్న ఆప్యాయత వల్ల వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం చూసి విద్యుత్ లేని సమయంలో ప్రీ ప్లాన్డ్ గా సీఎం జగన్ పై ప్రతిపక్షాలు దాడి చేయించాయన్నారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపించకుండా డ్రామాలు అంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు.