అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మెప్మా–నిపుణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అభ్యర్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మాత్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వినూత్న సంస్కరణలు అమలు చేస్తూ, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థినీ–విద్యార్థులకు మౌలిక వసతులను అందిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక