డోన్: బేతంచెర్ల సమీపంలో ఎదురెదురుగా వస్తూ రెండు ట్రాక్టర్లు డీ,ఇద్దరికీ తీవ్ర గాయాలు
Dhone, Nandyal | Apr 10, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల-బనగానపల్లె రహదారిలోని మలుపు వద్ద రెండు ట్రాక్టర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పలుకూరు నాపరాల గనుల నుంచి లోడుతో వస్తున్న ట్రాక్టర్ మరో వాహనాన్ని ఢీకొనడంతో పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీ విడిపోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేను సహాయంతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.