రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ ప్రాంతంలో శనివారం మద్యం మత్తులో అల్లరి చేసిన యువకుడిని రాయచోటి అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులను ఆపుతూ ప్రయాణికులు, సిబ్బందిపై దౌర్జన్యం చేస్తున్నాడని వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.విచారణలో ఆ వ్యక్తి పాతరాయచోటికి చెందిన ముదిర్ని కళ్యాణ్ అని గుర్తించారు. సంబేపల్లి మండలం నారాయణరెడ్డి గారి పల్లి వద్ద మద్యం సేవించిన కళ్యాణ్, రాయచోటికి రావడానికి బస్సులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.