ఒంగోలు అర్బన్: ఒంగోలు వెంకటరెడ్డి కాలనీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 12, 2026
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలు నగరంలోని పులి వెంకటరెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా చిలకలూరిపేటకు చెందిన శివ నాగరాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఏడాది కాలంగా ఒంగోలులోని పులి వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.