బనగానపల్లె: ఐఎఫ్ఎస్సి కు ఎంపికైన బనగానపల్లె మండల వాసి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన జయ అశ్వత్ రెడ్డి IFS సర్వీస్కు ఎంపికైనట్లు జయ అశ్వర్థ రెడ్డి తండ్రి ఉమామహేశ్వర రెడ్డి సోమవారం వెల్లడించారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన జయ అశ్వత్ రెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యారన్నారు. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు, పలువురు నాయకులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.