పాణ్యం మండలం కొత్తూరులో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న వసతి గృహ నిర్మాణానికి దాత రూ.3 లక్షల విరాళం అందజేసినట్లు ఈవో రామకృష్ణ బుధవారం తెలిపారు. గోనవరం గ్రామానికి చెందిన బండారం వెంకట సుబ్బయ్య, వెంగమ్మల జ్ఞాపకార్థం ముని మనవడు నాగ మనోజ్ అనే భక్తుడు ఈ విరాళం అందజేశారు. దాతకు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.