డోన్: పెట్రోల్ పై ఆందోళన అవసరం లేదు: బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి
Dhone, Nandyal | Apr 24, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహశీల్దార్ నాగమణి తెలిపారు. అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని సూచించారు. బంకు యజమానులు క్యాన్లు, బాటిళ్లలో ఇంధనం విక్రయించరాదని, బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.