రాజమండ్రి సిటీ: కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేసేందుకు కొవ్వూరులోనే గోష్పాద క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్షేత్రం కిటకిటలాడింది. వీరాధిమంది భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. పితృదేవతల పేరుతో బ్రాహ్మణులకు అన్నదానం చేయడం మహా పుణ్యమని పురోహితులు వారణాసి హనుమంత్ శర్మ తెలిపారు.