ఉరవకొండ: ఆవులెన్న గ్రామంలో వైయస్సార్సీపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ఆవులెన్న గ్రామంలో మంగళవారం సాయంత్రం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ మండల కన్వీనర్ మచ్చన్న పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ స్థానిక వైయస్సార్సీపీ నాయకులతో కలిసి నిర్వహించారు ప్రభుత్వం మెడికల్ కళాశాల కాలేజీల ప్రైవేటీకరణ చేయడం మూలంగా పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.