కనిగిరి: కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న దివాకర్ పల్లిలో మంచినీటి ఆరో ప్లాంట్ పునరుద్ధరించాలి: వ్య.కా.స జిల్లా కార్యదర్శి ఆంజనేయులు
పెదచెర్లోపల్లి మండలంలోని దివాకర పల్లిలో కిడ్నీ వ్యాధులతో బాధపడు గ్రామస్తులు అధికంగా ఉన్నారని, మరమ్మత్తులకు గురైన ఆర్వో ప్లాంటును బాగు చేయించి పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం దివాకర పల్లి గ్రామంలో మరమ్మత్తులకు గురైన మంచినీటి ఆర్వో ప్లాంట్ ను గ్రామస్తులతో కలిసి ఆయన పరిశీలించారు. గ్రామంలో ఎంతోమంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా ఆర్వో ప్లాంట్ సాధించుకున్నామన్నారు. ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు గురైనప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.