డోన్: 75 శాతం సబ్సిడీతో విత్తనాల పంపిణీ: డోన్ వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు
Dhone, Nandyal | May 13, 2026 ప్రభుత్వం రైతులకు 75 శాతం సబ్సిడీతో నాణ్యమైన పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తోందని డోన్ వ్యవసాయ శాఖ ఏడీ నాగరాజు తెలిపారు. బుధవారం ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆయన విత్తనాలు పంపిణీ చేశారు. రైతు సేవా కేంద్రాల్లో సి ఎస్ హెచ్ 24, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.