ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పాఠశాల పరిస్థితులపై తనిఖీ చేసి అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీవీ
ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ ను సందర్శించి, పాఠశాల పరిస్థితులపై అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అధ్యాపకులు తెలియజేసిన• విద్యుత్ సరఫరా సమస్యలు• తాగునీటి సమస్య• భవనాలు & ప్రాథమిక వసతుల అవసరాలు వంటి అంశాలను MLA గారు పూర్తిగా పరిశీలించి, వెంటనే సంబంధిత అధికారులు, శాఖలకు ఆదేశాలు జారీ చేసి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు.