ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ లో బిజెపిని గెలిపిస్తే పెద్దమ్మ గుడిని కట్టిస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
జూబ్లీహిల్స్లో BJPని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన పెద్దమ్మ గుడిని నిర్మిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. పెద్దమ్మ గుడి 11 ఎకరాల స్థలాన్ని MIM పార్టీకి ఇచ్చే విధంగా అగ్రిమెంట్ జరిగిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పతంగి ఓ దారం రేవంత్, మరో దారం KCR చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.