విశాఖపట్నం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన అధికారులు
విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారి యంత్రాంగం గత మూడు సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహిస్తూ వస్తోందని ఈ మేరకు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.