ఒంగోలు అర్బన్: గురుకుల పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రులు
Ongole Urban, Prakasam | Jul 13, 2026
ప్రకాశం జిల్లా టంగుటూరు లోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డిలతో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి, వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్డ్ టెలిఫోన్ సదుపాయాన్ని దగ్గరగా పరిశీలన చేశారు