కర్నూలు: కర్నూలు జిల్లాలో వలసల నివారణకు చర్యలు తీసుకోవాలి:కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి
కర్నూలు జిల్లాలో వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి అన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి నిర్వహించి సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉల్లి ,టమోటా ,పత్తి ,మిరప ,శనగ మొదలగు పంటలను ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీలో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు , ఒక ఎకరా కు ఎంత దిగుబడి వస్తుంది , రైతుకు ఎంత ఖర్చు అవుతుంది , గిట్టుబాటు ధర ఎంత వస్తుంది , ఏ విధంగా పంట నష్టం జరుగుతుంది పంట నష్ట కు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.