అనంతపురం అర్బన్: రామగిరి కొత్తపల్లి వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడి పలువురికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 1, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం సమీపంలో ఉన్న కొత్తపల్లి వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.