అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పరిధిలోని నక్కనదొడ్డి గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న టోల్ గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని కురుబ సావిత్రి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలం నరసాపురం గ్రామానికి చెందిన కురువ చిన్న లింగన్న భార్య కురువ సావిత్రి మహిళ సంఘంకు సంబంధించి పొదుపు డబ్బులు బ్యాంకులో కట్టేందుకు పాతకొత్తచెరువు గ్రామానికి వెళ్లేందుకు పది మంది మహిళలతో కలిసి బస్టాండ్ కు రాగా బస్సు ఢీ కొని మృతి చెందింది.