రాజమండ్రి సిటీ: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమండ్రిలోని జిల్లా కోర్టు ఆవరణలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల మొక్కను అందజేశారు కలెక్టర్. ప్రధాన న్యాయమూర్తితో పలు విషయాలను కలెక్టర్ కీర్తి చర్చించడం జరిగింది.