ఒంగోలు అర్బన్: ఎఫ్‌ఎల్‌ఎన్ 3.0 శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారిణి సి.వి. రేణుక
Ongole Urban, Prakasam | May 30, 2026
ప్రకాశం జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్ 3.0) శిక్షణా కార్యక్రమం రామచంద్ర మిషన్‌లో నిర్వహించబడుతోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారిణి శ్రీమతి సి.వి. రేణుక సందర్శించి, శిక్షణలో పాల్గొంటున్న డీఆర్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమిక భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ప్రకాశం జిల్లాను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు, డీఆర్పీలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెరిగి ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.