కడప: కడప నగరంలోని 21 డివిజన్ రాజీవ్ పార్క్ నందు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
Kadapa, YSR | Oct 30, 2025 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కడప నగరంలోని 20వ డివిజన్ రాజీవ్ పార్క్ నందు నిర్వహించిన కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్.బి.అంజాద్ భాష గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అంజాద్ భాష మాట్లాడుతూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు, ఈ యొక్క కార్యక్రమంలో  ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రజలలో చైతన్యం తెచ్చే విధంగా తీసుకువెళ్లాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో సంతకాల సేకరణ కార్యక్రమం  చేపట్టినట్లు తెలిపారు.