బనగానపల్లె: చింతలాయిల పల్లెలో గడ్డి దగ్ధం
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో పశువుల కోసం సాగుచేసిన పచ్చి గడ్డి ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు భాదిత రైతు అంబటి కృష్ణారెడ్డి వెల్లడించారు.బుధవారం కృష్ణారెడ్డి పక్క పొలంలో ఎండు గడ్డికి నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి, పక్కనే ఉన్న కృష్ణారెడ్డి పశువుల మేత కోసం సాగుచేసిన పచ్చి గడ్డి, విద్యుత్ కేబుల్ ఇతర సామగ్రి దగ్గమయ్యాయి.పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.