వెలిగండ్లలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలకు బుధవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఆసక్తిని ఘనపరచడమే కాకుండా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ముగ్గులు వేసే మహిళల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేసి ఆ బాక్సుల్లోనే ముగ్గులు వేసేలా చర్యలు తీసుకున్నారు. ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు నిర్వాహకులు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో వెలిగండ్ల సర్పంచ్ సురేష్ బాబు, వీఆర్వో పరశురాం , స్థానిక నాయకులు పాల్గొన్నారు